సిఎం చంద్రబాబు సారథ్యంలో సాగుతున్న సుపరిపాలన వల్ల ప్రజల్లో హర్షం నెలకొందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం కర్నూలులో 42వ డివిజనలో ఇన్చార్జి తమ్మారెడ్డి ఆధ్వర్యంలో సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాలు వివరించారు. నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, నాగేంద్ర, సోమిశెట్టి నవీన, సత్రం రామకృష్ణ పాల్గొన్నారు.