దొంగతనం కేసులలో ప్రాపర్టీ రికవరీ శాతం పెంచి బాధితులకు న్యాయం చేయాలని కర్నూలు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ అన్నారు. శుక్రవారం కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. దీర్ఘకాలికంగా ఉన్న పెండింగ్ కేసులపై ఆరా తీశారు. సబ్ డివిజన్‌ల వారీగా పోలీసు బృందాలను ఏర్పాటు చేసి దొంగతనాల కేసులను ఛేదించి రికవరీ శాతం పెంచి బాధితులకు న్యాయం చేయాలన్నారు.