కర్నూలు: అగ్ని ప్రమాదంలో గాయపడిన ఎస్సై మృతి

కర్నూలులో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన సీసీఎస్ విభాగం ఎస్సై మాసన్న చికిత్స పొందుతూ గురువారం మృతిచెందారు. 1989 బ్యాచ్‌కు చెందిన మాసన్న పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా చేరి విధుల్లో ఎదిగారు. ఈనెల 5న ఆయన నివాసంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక కన్నుమూశారు. మాసన్నకు భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు.

సంబంధిత పోస్ట్