అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలు విద్యార్థి ఇస్కాల వెంకట కౌశిల్ (26) మృతి చెందాడు. కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీకి చెందిన ఇస్కాల రవికుమార్ కుమారుడు, టెక్సాస్‌లోని బ్యూమౌంట్‌లో లామర్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు. ఈనెల 12వ తేదీన కారు నడుపుతూ రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు. శనివారం రాత్రి మృతదేహం కర్నూలుకు చేరింది.