కర్నూలు: రోడ్డు ప్రమాదంలో కాపలాదారుడు దుర్మరణం

కర్నూలు సంతోషనగర్ వద్ద జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో నాగరాజు (44) అనే కాపలాదారు మృతిచెందారు. కొండారెడ్డి నగర్‌కు చెందిన నాగరాజు ఓ వాహన షోరూంలో కాపలాదారుగా పనిచేస్తున్నారు. హైవే దాటుతుండగా, శరీన్‌నగర్‌కు చెందిన పెద్దరాముడు అనే యువకుడు ద్విచక్రవాహనంతో అతడిని ఢీకొట్టాడు. ఆటోడ్రైవర్ ఆసుపత్రికి తరలించినా, అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్