రాష్ట్రంలోని వైసీపీ నాయకులు దిగజారుడు రాజకీయాలు ఇకనైన మానుకోవాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు హితువుపలికారు. బుధవారం కర్నూలు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చురుగ్గా కోనసాగుతుందన్నారు. జగన్ కుటుంబ ఆస్తుల విషయంలో వైసీపీ నాయకులు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డికి టీడీపీపై ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు.