ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ జన్మదినాన్ని పురస్కరించుకుని, కర్నూలు జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు గుడిపల్లి సురేందర్, మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ సభ్యులు బుధవారం కర్నూలులోని అమ్మ అనాధ శరణాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శరణాలయ నివాసులకు భోజనాలు వడ్డించి, మంత్రి టీజీ భరత్ ఆయురారోగ్యాలతో ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.