రాయలసీమ రాష్ట్ర సేన కోసం కొత్త కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వ్యవస్థాపక అధ్యక్షుడు రాయలసీమ రజాక్ కర్నూలులో తెలిపారు. రాయలసీమ జిల్లాల్లో పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా పోరాడేవారు, ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి చేరేలా కృషి చేసేవారు, విద్యార్థులు, యువకులు, ఉత్సాహవంతులు ఈ కమిటీలో చేరాలని ఆయన పిలుపునిచ్చారు.