పెద్దకడబూరు ఎన్నికలు: కూటమి అభ్యర్థులకు మద్దతు తెలపాలని రమాకాంత్ రెడ్డి పిలుపు

పెద్దకడబూరు మండలంలో రేపు జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి ఎన్. రమాకాంత్ రెడ్డి బుధవారం కీలక విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ తమ ఓటును సైకిల్ గుర్తుపై వేసి కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో ఓటర్లు తమ బాధ్యతను గుర్తించి, కూటమి విజయానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕