పుల్లాపురం-తెర్నకల్ రోడ్డు అభివృద్ధికి రూ. 2.95 కోట్లు మంజూరు

ఆదోని పర్యటనలో ఉన్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్‌ను రాష్ట్ర వాల్మీకి చైర్మన్   కప్పట్రాళ్ల బొజ్జమ్మ కలిసి, దేవనకొండ మండలంలోని పుల్లాపురం నుంచి తెర్నకల్ వరకు ఉన్న మట్టి రోడ్డును బీటీ రోడ్డుగా అభివృద్ధి చేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ విజ్ఞప్తికి స్పందించిన నారా లోకేష్, కర్నూలు జిల్లాలో రహదారి అభివృద్ధికి రూ. 2.95 కోట్లు నిధులు మంజూరు చేశారు. ఈ నిధుల మంజూరు పట్ల బొజ్జమ్మ సంతోషం వ్యక్తం చేస్తూ, ప్రజల అవసరాలను గుర్తించి రహదారి అభివృద్ధికి కృషి చేస్తున్న లోకేష్‌కు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕