కేసీ కాలువలో పడి యువకుడు మృతి

కర్నూలు నగరంలో కేసీ కాలువలో ఈతకు వెళ్లి అజయ్ కుమార్ (25) అనే యువకుడు మృతి చెందారు. సోమవారం ఉదయం కొండారెడ్డినగర్ చర్చి వద్ద కేసీ కాలువలో ఈత కొడుతుండగా, మెట్లపై జారి తల సిమెంటు మెట్టుకు తగిలి స్పృహతప్పి నీటిలో మునిగిపోయారు. స్థానికులు కాపాడేందుకు ప్రయత్నించిన గుర్రపుడెక్క ఉండటంతో సాధ్యం కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్ఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఇరిగేషన్ అధికారులు గుర్రపుడెక్కను తొలగించిన తర్వాత రాత్రికి మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.

సంబంధిత పోస్ట్

✕
✕