ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ (APOSS) ద్వారా 2026-27 విద్యా సంవత్సరానికి నిర్వహిస్తున్న పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ ప్రవేశాల దరఖాస్తు గడువును పొడిగించినట్లు ఎమ్మిగనూరు జెడ్పీ పాఠశాల హెచ్ఎం కోటయ్య బుధవారం ఉదయం వెల్లడించారు. విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా నవంబర్ 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత నవంబర్ 16 నుండి 30 వరకు రూ. 200 ఆలస్య రుసుముతో అవకాశం కల్పించారు. కర్నూలు, మంత్రాలయం ప్రాంతాల్లోని ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.