పండ్లు, కూరగాయల ఎగుమతులపై అవగాహన సదస్సు

ఏపీఈడీఏ, ఉద్యాన శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జూలై 7న బనవాసిలోని కేవీకే నందు పండ్లు, కూరగాయల ఎగుమతులపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు హెచ్ఓ అపర్ణ సోమవారం తెలిపారు. ఎగుమతి అవకాశాలు, నాణ్యత ప్రమాణాలు, GAP విధానాలు, మార్కెట్ అనుసంధానం తదితర అంశాలపై నిపుణులు రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు. రైతులు, FPOలు, RSK సిబ్బంది, వ్యవసాయ పారిశ్రామికవేత్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్