మంత్రాలయం మండలంలోని వి. తిమ్మాపురంలో తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురు చిన్నారుల పరిస్థితి దయనీయంగా మారింది. కూలీ పనులు చేసుకునే వారి తల్లిదండ్రులు రూతమ్మ, ఆదాం హైదరాబాద్‌లో పనికి వెళ్లగా, ఐదేళ్ల కిందట తల్లి క్రేన్ ప్రమాదంలో మృతి చెందారు. ఇటీవల అనారోగ్యంతో తండ్రి ఆదాం కూడా కన్నుమూశారు. దీంతో విజయ్‌కుమార్, జ్యోతి, మహిమరాజు అనే ముగ్గురు పిల్లలు అనాథలుగా మిగిలారు. వారిని ఆదుకోవాలని గ్రామస్థులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.