రాష్ట్ర స్థాయిలో మెరిసిన దీపిక: మంత్రి చేతుల మీదుగా షైనింగ్ స్టార్ అవార్డు

పెద్దకడబూరు మండలం చిన్నతుంబలం గ్రామానికి చెందిన ఎస్. దీపిక, బనవాసి ఏపీఆర్‌జేసీ బాలికల కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ గ్రూపులో 988 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచింది. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఆమెకు షైనింగ్ స్టార్ అవార్డుతో పాటు ల్యాప్‌టాప్ అందజేశారు. ఉన్నత విద్య కోసం ప్రభుత్వ తరఫున అవసరమైన సహాయం అందిస్తామని సోమవారం మంత్రి హామీ ఇచ్చారు. దీపిక సాధించిన విజయంపై ఆమె తల్లిదండ్రులు ఎస్. వీరేష్, సునీతమ్మ ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్