కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలోని కౌతాళం మండలంలోని ఉరుకుందలో వెలసిన శ్రీ నరసింహ ఈరన్నస్వామి దేవస్థానంలో ఆదోనికి చెందిన బి. మహేశ్వరి, శివ రమణ దంపతులు నిత్య అన్నదాన కార్యక్రమం కోసం రూ. 1,00,116 విరాళంగా ఆదివారం అందించారు. ఈ సందర్భంగా దేవస్థానం ఆలయ అర్చకులు దాతలకు స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పించి, శేషవస్త్రాలు, లడ్డు ప్రసాదం, మరియు బాండ్ రసీదును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు పాల్గొన్నారు.