ఆదోని ఎస్సీ హాస్టల్‌లో విద్యార్థినుల వసతి సౌకర్యాల మెరుగుదలకు అదనపు షెడ్ నిర్మాణం కోసం వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వై. ప్రదీప్ రెడ్డి రూ. 30 వేల ఆర్థిక సహాయాన్ని శుక్రవారం అందజేశారు. ఈ మొత్తాన్ని ఎమ్మిగనూరులో ఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కవిత రెడ్డికి అందజేశారు. విద్యార్థినుల సంక్షేమానికి తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ప్రదీప్ రెడ్డి హామీ ఇచ్చారు.