ఆదోనిలో ఆయిల్ గోడౌన్‌లో అగ్నిప్రమాదం: అదృష్టవశాత్తూ పెను ప్రమాదం తప్పింది

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో మారెమ్మ గుడి సమీపంలోని ఆయిల్ నిల్వ ఉంచిన గోడౌన్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. గుర్తు తెలియని వ్యక్తులు సిగరెట్ తాగి పారేయడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో, సకాలంలో చేరుకున్న ఫైర్ ఇంజన్ మంటలను అదుపులోకి తెచ్చింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని స్థానికులు తెలిపారు. ఈ సంఘటన ఆదోనిలో కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్