కర్నూలు జిల్లా, మంత్రాలయం మండలం చిన్నకడబూరు గ్రామంలో మాంత్రికి లక్ష్మి (15) అనే బాలిక తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ, మానసికంగా కలత చెంది ఆదివారం సాయంత్రం ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే స్పందించినప్పటికీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిసింది. మృతురాలి తల్లి మాంత్రికి నాగమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కడుపు నొప్పి బాధను తట్టుకోలేక బాలిక ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.