ఆదోనిలో రేపు కబడ్డీ జిల్లా జట్ల ఎంపికలు

కర్నూలు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 36వ సబ్‌-జూనియర్ బాలురు, బాలికల జిల్లా జట్ల ఎంపికలు అక్టోబర్ 2న ఉదయం 9 గంటలకు ఆదోని ఏపీహెచ్‌బీ కాలనీలోని నేషనల్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు చావిడి వెంకటేశ్, డా. వలకలదిన్నె వెంకటేష్ గురువారం  తెలిపారు. బాలురకు 60 కిలోలు, బాలికలకు 55 కిలోల లోపు బరువు ఉండాలి. అర్హత కలిగిన క్రీడాకారులు ఎంపికలకు హాజరుకావాలని కోరారు. సంప్రదించేందుకు ఫోన్ నంబర్ 9177320094.

సంబంధిత పోస్ట్

✕
✕