పెద్దకడబూరు మండలం కల్లుకుంట గ్రామానికి చెందిన ఖజా బాషా(37) అనే వ్యక్తి మృతి చెందారు. గత శుక్రవారం ఎమ్మిగనూరు నుంచి స్వగ్రామానికి బయలుదేరుతుండగా రాగిమాన్ దొడ్డి వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి తలకు బలమైన గాయమైంది. వారం రోజులుగా మృతువుతో పోరాడుతూ గురువారం ఉదయం 5 గంటలకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందారు. దింతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రభుత్వం వారి కుటుంబాని ఆదుకోవాలని బంధువులు కోరారు.