కర్నూలు జిల్లాలోని మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగి మండలంలో చిరుతపులి సంచారం స్థానికులను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఆదివారం గ్రామ శివారులో ఒక రైతు పొలం పక్కన కాల్వలో చిరుతను చూసిన గ్రామస్తులు ఆందోళనకు లోనయ్యారు. చిరుత గొంతులో ఎముక ఇరుక్కొని, కదలలేని స్థితిలో ఉండగా, సెల్‌ఫోన్లలో చిరుతను చిత్రికరించేందుకు పోటీ పడ్డారు. కానీ చిరుతపులి మాత్రం కాల్వలో నీరు తాగుతూ కనిపించింది.