ఏడాది పాపను శ్రీ మఠం వద్ద వదిలేసిన తల్లి

కర్నూలు జిల్లా నందవరం మండలం గురుజాలకు చెందిన ఓ తల్లి, భార్యాభర్తల గొడవ కారణంగా తన ఏడాది పాపను మంత్రాలయం శ్రీ మఠం వద్ద బుధవారం వదిలేసింది. భర్త నిలదీయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఎస్సై మల్లికార్జున పాపను స్వాధీనం చేసుకొని, ఐసీడీఎస్ సూపర్వైజర్ సుమిత్రమ్మ సమక్షంలో తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి పాపను అప్పగించారు. చిన్నచిన్న గొడవలకు పిల్లలను ఇలా వదిలేయవద్దని ఐసీడీఎస్, పోలీస్ అధికారులు తల్లిదండ్రులను హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్