కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం, పెద్దకడబూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి తన ఓటు హక్కును గురువారం వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తమ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుందని ధీమా వ్యక్తం చేశారు. మండలంలోని 16 ఎంపీటీసీ స్థానాలతో పాటు జెడ్పీటీసీ స్థానంలో టీడీపీ విజయం సాధిస్తుందని, ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారని ఆయన అభిప్రాయపడ్డారు.