పెద్దకడబూరు: భార్యాభర్తల మధ్య మనస్పర్ధతో.. భర్త ఆత్మహత్య

పెద్దకడబూరు మండలం చిన్నకడబూరు గ్రామానికి చెందిన 30 ఏళ్ల కలుగొట్ల నాగన్న బుధవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై నిరంజన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పదేళ్ల కిందట కంబళదిన్నెకు చెందిన లక్ష్మితో వివాహమైన నాగన్నకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధల కారణంగా భార్య పుట్టింట్లో ఉండడంతో నాగన్న మద్యం బానిసయ్యాడు. జీవితంపై విరక్తితో ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు.

సంబంధిత పోస్ట్