పెద్దకడబూరు గ్రామంలో ఆదివారం ఎంపీపీ శ్రీవిద్య, వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి 0-5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని, తద్వారా అవిటితనం దరిచేరకుండా కాపాడవచ్చని పిలుపునిచ్చారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఈ చుక్కలు వేయడం జరిగింది.