పీఆర్సీ, డీఏ బకాయిలు చెల్లించాలి

పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ, ఐఆర్, డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ జేఏసీ అమరావతి పిలుపు మేరకు పెద్దకడబూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం రెవెన్యూ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని తహసీల్దార్ వలిబాషా కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ జెర్మియా, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులు, వీఆర్వోలు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్