మంత్రాలయంలో రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు

కర్నూలు జిల్లా మంత్రాలయంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా బుధవారం  ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు భీమారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. పేదలు, రైతుల సంక్షేమం కోసం వైఎస్సార్ చేసిన సేవలు మరువలేనివని నాయకులు కొనియాడారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య, మాజీ వైస్ సర్పంచ్ ప్రమేష్ స్వామి, వైస్ ఎంపీపీ పులికుక్క రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్