ఆదోనిలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న భాష్యం స్కూల్‌ను సీజ్ చేయాలని ఆర్‌పీఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రదీప్ డిమాండ్ చేశారు. కర్నూలు, మంత్రాలయం ప్రాంతాల్లోని ఈ స్కూల్, పుస్తకాలు, యూనిఫారాలు, డొనేషన్లు, ఇతర కార్యకలాపాల పేరుతో తల్లిదండ్రుల నుంచి అధిక మొత్తాలు వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని పట్టించుకోని ఎంఈఓ, డిప్యూటీ డీఈఓలపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. సబ్ కలెక్టర్ సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.