ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి

ఉపాధి పనులను కూలీలు సద్వినియోగం చేసుకోవాలని ఏపీడి లోకేశ్వర్ కోరారు. శుక్రవారం పెద్దకడబూరులోని ఎస్సీ కాలనీలో ఏపీఓ ఖాదర్ భాష ఆధ్వర్యంలో ఉపాధి పనులపై కూలీలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి పనుల్లో ఖచ్చితమైన కొలతలతో పని చేస్తే ఎక్కువ వేతనం పొందవచ్చునని తెలిపారు. కొంత మంది కూలీలు ఆలస్యంగా పనులకు వస్తారని, దీంతో తమకు తక్కువ వేతనాలు పడతాయని కూలీలు ఏపీడి దృష్టికి తెచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్