పెద్దకడబూరులోని సీఎస్‌ఐ చర్చి సమీపంలో ఆదివారం నిర్వహించిన పోలియో చుక్కల కార్యక్రమంలో టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి నరవ శశిరేఖ, ఎంపీటీసీలు సుజాత, కుదే లక్ష్మమ్మ పాల్గొన్నారు. ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, పోలియో రహిత సమాజాన్ని నిర్మించడంలో భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం కర్నూలు, మంత్రాలయం ప్రాంతాలలో జరిగింది.