చిన్నారులకు పోలియో చుక్కలు వేయించిన టీడీపీ నాయకులు

పెద్దకడబూరు మండలంలోని కంబదహాల్ గ్రామంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ మునెప్ప 0-5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. పిల్లలకు అవిటితనం రాకుండా రెండు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మల్ధకల్ కూడా పాల్గొన్నారు. కర్నూలు, మంత్రాలయం ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జరిగింది.

సంబంధిత పోస్ట్