తాళం వేసిన ఇంట్లో చోరీ... బంగారం, వెండి అపహరణ

పెద్దకడబూరు గ్రామంలో తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం చోరీకి పాల్పడ్డారు. బోయ అగ్రహారం లక్ష్మన్న దంపతులు పొలం పనులకు వెళ్లిన సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు బీరువా పగులగొట్టి 1. 5 తులాల బంగారం, 36 తులాల వెండి ఆభరణాలు అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మారుతి తెలిపారు.

సంబంధిత పోస్ట్