మంత్రాలయం మండలం సూగూరులో విద్యుదాఘాతంతో నాగేంద్రప్ప (62) మృతి చెందారు. బుధవారం గాలివాన సమయంలో మలవిసర్జనకు వెళ్లిన ఆయన, షెడ్డు పక్కన విద్యుత్ తీగలు తగిలి షాక్ కు గురై అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. ఆసుపత్రికి తరలించగా ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. మూడు రోజుల కిందట మనుమరాలి వివాహం జరగడంతో కుటుంబంలో ఆనందం ఉండగా, ఒక్కసారిగా విషాదం నెలకొంది. భార్య, ఐదుగురు కుమారులు, నలుగురు కూతుళ్లు ఉన్నారు.