తుంగభద్ర: ఉరివేసుకుని గుర్తు తెలియని వ్యక్తి బలవన్మరణం

మంత్రాలయం మండలం తుంగభద్ర రైల్వే స్టేషన్ సమీపంలో ఆదాని వీల్ మార్ ఆయిల్ ఫ్యాక్టరీ దగ్గర బుధవారం చెట్టుకు ఉరివేసుకుని గుర్తు తెలియని వ్యక్తి బలవన్మరణం చెందాడు. మాధవరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు 30-35 ఏళ్ల మధ్య వయసున్నవాడు, బూడిద రంగు జీన్స్, బ్రౌన్ టీషర్టు ధరించి ఉండటంతో పాటు కాలేజీ బ్యాగ్ సంఘటన స్థలంలో లభించిందని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్