పెద్దకడబూరులో పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్ల క్యూ

కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని పెద్దకడబూరు మండలం, హనుమాపురం గ్రామంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉత్సాహంగా కొనసాగింది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో జెడ్పీటీసీ అభ్యర్థిగా పూజారి ఈరన్న, ఎంపీటీసీ బరిలో బోయ లలిత మరియు పూజారి లక్ష్మి పోటీ పడుతున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕