ఎల్లెల్సీ కింద డిస్ట్రిబ్యూటర్ లకు నీరు విడుదల చేయాలి.. వైసీపీ నాయకులు

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం పెద్దకడబూరులోని తహసీల్దార్ కార్యాలయం వద్ద వైసీపీ నాయకులు రామ్మోహన్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, రవిచంద్రారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఎల్ నినోను సాకుగా చూపుతూ ఎల్లెల్సీ కింద ఉన్న ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయకపోవడం దారుణమని, తక్షణమే అధికారులు స్పందించి రైతులు సాగు చేసిన పంటలకు నీరు విడుదల చేయాలని తహసీల్దార్ వలిబాషాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎల్లెల్సీ కింద ఉన్న డిస్ట్రిబ్యూటర్ లకు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్