పెద్దకడబూరు మండలంలోని కల్లుకుంట గ్రామ బస్టాండ్ మరియు రహదారి 25 ఏళ్లుగా శాశ్వత మరమ్మతులకు నోచుకోక అధ్వానంగా మారింది. అప్పుడప్పుడు ప్యాచింగ్ పనులు చేపట్టినా నెల రోజుల్లోనే గుంతలు ఏర్పడుతున్నాయని సీపీఎం మండల కార్యదర్శి ఈ. తిక్కన్న అన్నారు. రహదారి దుస్థితితో విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజాధనాన్ని తాత్కాలిక మరమ్మతులకు ఖర్చు చేయకుండా శాశ్వత ప్రాతిపదికన రహదారి నిర్మించాలని డిమాండ్ చేశారు.