కర్నూలు జిల్లాలోని పెద్దకడబూరు మండలంలో సోమవారం ఏరువాక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. హనుమాపురం, పెద్దకడబూరు గ్రామాలలో యువత కోసం పరుగు పందెం నిర్వహించారు. హనుమాపురంలో మహేంద్ర, పులికొండ వరుసగా ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించగా, పెద్దకడబూరులో రమేష్, గోవిందు ఇదే స్థానాలను కైవసం చేసుకున్నారు. ఈ వేడుకల్లో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు.