చిన్న తుంబలంలో ప్రశాంతంగా కొనసాగుతున్న జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిన్న తుంబలంలోని హైస్కూల్లో జడ్పిటిసి మరియు ఎంపిటిసి ఎన్నికలు ప్రశాంతంగా గురువారం ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటల నుండి ఓటర్లు భారీగా తరలిరావడంతో, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే స్థానిక ప్రాంతాల్లో మద్యం విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనిపై సంబంధిత పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕