నందికొట్కూరు తాసిల్దార్ శ్రీనివాసులు కార్యాలయం వద్ద 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఎగరవేసిన జాతీయ జెండా మొరాయించింది. జాతీయ జెండాను ఎగర వేయడానికి ప్రయత్నం చేయగా జెండా ముడి ఓపెన్ కాకపోవడంతో జెండాను కర్రను కిందికి దించి మళ్లీ జెండాకు ముడివేసి జెండాను ఆవిష్కరించారు. జెండాను కిందికి దించి మళ్లీ ఎగరవేయడం రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమే నని స్థానికులు విమర్శిస్తున్నారు.