కేసీ కెనాల్ చెక్ పవర్ మార్పుపై ఆరోపణలు

కేసీ కెనాల్ డివిజన్ డీఈ రవికుమార్ తన పేరుతో ఉన్న జాయింట్ అకౌంట్ చెక్ పవర్ ను అక్రమంగా మార్చి, పాత అధ్యక్షుడు వెంకటరమణారెడ్డి పేరుతో రూ. 9.42 లక్షల చెక్కు జారీ చేశారని డబ్ల్యూ-13 నీటి సంఘం అధ్యక్షుడు రామచంద్రారెడ్డి శుక్రవారం ఆరోపించారు. దీనిపై ప్రశ్నించగా డీఈ దురుసుగా ప్రవర్తించారని ఆయన తెలిపారు. ఈ విషయం ఎంపీ శబరి, కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో ఈఈ ప్రతాప్ విచారణ ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్