నంద్యాల మండలం కొత్తపల్లిలో బుధవారం ఉదయం వైసీపీ ఎంపీటీసీ హరినాథ్ రెడ్డిపై ముసుగులు ధరించిన దుండగులు దాడి చేశారు. పొలానికి వెళ్తుండగా జరిగిన ఈ దాడిలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడి రాజకీయ కక్షతోనే జరిగిందని బాధితుడు ఆరోపించారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు.