బేతంచెర్ల మండలం రుద్రవరం వద్ద చామంతి పూలతో వెళ్తున్న బొలెరో అదుపు తప్పి బోల్తా పడడంతో బోయ శ్రీకాంత్(20) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఒక తోట నుంచి పూలను లోడ్ చేసి మరో తోటకు తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.