పగిడ్యాల మండలానికి చెందిన 85 ఏళ్ల సువార్తమ్మ అనారోగ్యంతో మనస్తాపం చెంది క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘోరం జరిగింది. కుటుంబ సభ్యులు ఆమెను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.