నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామానికి చెందిన దాసరి వంశీ అనే వ్యక్తి నుంచి ఎనిమిది లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు నందికొట్కూరు ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అనంతరం కొల్లభావపురం గ్రామ సమీప అటవీ ప్రాంతంలో 30 ప్లాస్టిక్ బిందెలలో నాటు సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 450 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.