మిడుతూరు మండలం చింతలపల్లికి చెందిన మేకల జయమ్మ(60) శుక్రవారం గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలంలో ఉన్న బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.