గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

మంగళవారం రాత్రి కేసీ కాల్వలో దూకి గల్లంతైన వంశీ (22) అనే యువకుడి మృతదేహం బనకచర్ల హెడ్డెగ్యూలేటర్ సమీపంలో లభ్యమైంది. పాములపాడు మండలం కోల్గానందాపురానికి చెందిన వంశీ, అప్పుల విషయంలో కుటుంబసభ్యులతో వివాదం తర్వాత మనస్తాపంతో కాల్వలో దూకినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టి శుక్రవారం మృతదేహాన్ని గుర్తించాయి. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్