నందికొట్కూరు: 71 కేసుల్లో 75 మంది అరెస్ట్

నందికొట్కూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 2025 సంవత్సరానికి సంబంధించిన కేసుల వివరాలను సీఐ రామాంజనేయులు బుధవారం వెల్లడించారు. నాటుసారా విక్రయాలపై 71 కేసులు నమోదు చేసి 75 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. దాడుల్లో 841 లీటర్ల సారా, 3 వాహనాలు సీజ్ చేసి, 17,860 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 39 బెల్టు షాపులపై కేసులు నమోదు చేసి, 83.44 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్