నందికొట్కూరు: గని కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి: సీపీఎం

గని కార్మికులకు సమగ్ర చట్టం చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం. నాగేశ్వరావు డిమాండ్ చేశారు. గురువారం మిడుతూరు మండలంలోని నాగులుటి గనులను సందర్శించి, కార్మికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ఎండనక, వాననక కార్మికులు పని చేస్తున్న కార్మికులకు ప్రభుత్వం లేబర్ కార్డు అందించి, 50 సం. లకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్